Advertisement

పాతజోరు చూపిస్తున్న రవితేజ..!

Mon 02nd Feb 2015 06:26 AM
raviteja,balupu,power,kick2,bengal tiger  పాతజోరు చూపిస్తున్న రవితేజ..!
పాతజోరు చూపిస్తున్న రవితేజ..!
Advertisement

మాస్‌ మహారాజా రవితేజ స్పెషాలిటీ ఏమిటంటే హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తుండటమే. అయితే ‘బలుపు’ చిత్రానికి ముందు ఆయనకు వరుస ఫెయిల్యూర్స్‌ ఎదురవ్వడంతో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు రవితేజ. ‘బలుపు’ హిట్‌ అవ్వడంతో తనలో మళ్ళీ ఉత్సాహం నెలకొంది. వెంటనే ‘పవర్‌’ రూపంలో మరో హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో రవితేజ మరలా తన పాత ధోరణిలోకి వెళుతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘కిక్‌2’ చిత్రంలో నటిస్తున్న రవితేజ, ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందబోతున్న ‘బెంగాల్‌ టైగర్‌’ను లైన్‌మీదకి తెచ్చుకున్నాడు. ఇకపై కూడా ఏడాదికి రెండు, మూడు సినిమాలు ఖచ్చితంగా విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడట రవితేజ. కిక్‌2తో పాటు బెంగాల్‌టైగర్‌ కూడా ఇదే ఏడాది విడుదలకానుంది. అన్నట్లు ఇప్పటి వరకు 50 కోట్ల క్లబ్‌లో చేరని రవితేజ, ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రంతో ఆ మార్క్‌ని పొందడానికి చూస్తున్నాడని టాక్‌. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం రవితేజకి ఆ ఫిగర్‌ని అందిస్తుందో వెయిట్‌ అండ్‌ సీ..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement