Advertisementt

'బాహుబలి' లీక్ వీరుడు దొరికేసాడు..!

Sun 01st Feb 2015 11:27 PM
bahubali,movie leak,makuta visual effects,varma  'బాహుబలి' లీక్ వీరుడు దొరికేసాడు..!
'బాహుబలి' లీక్ వీరుడు దొరికేసాడు..!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ''బాహుబలి''. భారీ అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని సీన్లు సినిమా రిలీజ్ అవకముందే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కనిపించాయి. ఈ విషయం తెలుసుకొని హవాక్కయిన చిత్ర బృందం పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ నుంచి వీడియో లీకైనట్లు గుర్తించారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన వీడియోని ల్యాప్ టాప్ లో వర్మ అనే వ్యక్తి ఇంటికి తీసుకువెళ్లి, సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ లో ఫ్రెండ్స్ కు పంపాడు. 13 నిమిషాల ఫైటింగ్ సీన్లను మాత్రమే తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన వర్మ స్నేహితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ