ఆశగా ఎదురుచుస్తోన్న సదా..!

CineJosh news

హీరోయిన్ సదా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 'జయం' సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే అద్భుతమైన హిట్ సాదించింది. తనదైన స్టైల్ లో 'వెళ్ళవయ్యా.. వెళ్లు..' అంటూ యువతను ఉర్రూతలూగించింది. దాంతో ఆమెకు వెంటనే స్టార్స్ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. శంకర్- విక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన 'అపరిచితుడు' లో హీరోయిన్ గా నటించిన తర్వాత ఇక ఆమెకు తిరుగు లేదనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఆ స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. అందం, అభినయం ఉన్నప్పటికీ అద్రుష్టం మాత్రం ఆమెకు వరించలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ తో పాటు టీవీ రియాల్టీషోలలో జడ్జిగా చేస్తూ బండి లాగిస్తోంది. అయినా ఆమెకు ఇప్పటికీ తన కెరీర్ పై నమ్మకం పోలేదు. ఎలాగైనా మరలా లైం లైట్ లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఇటీవల ఓ హాట్ ఫోటోషూట్ చేసుకొని వార్తల్లో వ్యక్తిగా మారింది. మరి ఆమె కల ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.

sada
shankar aparichithudu
realty shows
hot photo shoot