Advertisementt

ఢిల్లీ ఎన్నికల్లో ఎవరిది ముందంజ..??

Fri 30th Jan 2015 04:23 AM
arvind kejriwal,kiran bedi,delhi elections,the week opinion poll  ఢిల్లీ ఎన్నికల్లో ఎవరిది ముందంజ..??
ఢిల్లీ ఎన్నికల్లో ఎవరిది ముందంజ..??
Advertisement
Ads by CJ

ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీకి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న ఆప్‌ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు మోడీ మానియాకుతోడు కిరణ్‌బేడికి ఉన్న పేరును సొమ్ము చేసుకొని అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. అయితే గతేడాది ప్రజలు అధికారం కట్టబెట్టినా.. కుంటిసాకులతో కావాలనే కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం దెబ్బతింది. ఇది బీజేపీ అవకాశాలను మరింత మెరుగుపర్చాయి. అదే సమయంలో సీఎంగా కేజ్రీవాల్‌కు మాత్రం ప్రజల మద్దతు కిరణ్‌బేడి కంటే కూడా అధికంగా ఉండటం గమనార్హం. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ది వీక్‌ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. బీజేపీకి 39శాతం మంది మద్దతు తెలపగా ఆప్‌ పార్టీకి 37.5 శాతం మంది మద్దతు పలికారు. అదే సమయంలో సీఎంగా కేజ్రీవాల్‌కు 40శాతం మంది మద్దతు తెలపగా కిరణ్‌బేడికి 39శాతం మంది మద్దతు పలికారు. దీన్నిబట్లి ఢిల్లీ పీఠం కోసం హోరాహోరీ పోరు తప్పే కనబడ లేదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ