Advertisementt

రకుల్ కూడా డబుల్ చేసింది..!

Wed 28th Jan 2015 07:42 AM
  రకుల్ కూడా డబుల్ చేసింది..!
రకుల్ కూడా డబుల్ చేసింది..!
Advertisement
Ads by CJ

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే సినిమా వాళ్లకు ముఖ్యంగా హీరోయిన్లకు వర్తించినంతగా ఎవ్వరికి వర్తించదనే  చెప్పాలి. గ్లామర్, డిమాండ్ ఉండగానే రెమ్యూనరేషన్ ను పెంచేయాలని వారు ఆశిస్తూ ఉంటారు. హీరోయిన్ల రన్ టైం కూడా చాలా తక్కువ కావడంతో వారిని ఈ విషయంలో తప్పుపట్టడానికి వీలులేదు. ఓవర్ నైట్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్  హోదా పొందిన రకుల్ ప్రీత్ సింగ్ 'లౌక్యం, కరెంటుతీగ' చిత్రాల తర్వాత తన పారితోషికాన్ని డబుల్ చేయడం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. సినిమాకు 25 లక్షలు  తీసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం 50 లక్షలు ఇవ్వందే ఏ సినిమా అయినా, ఏ హీరో సరసన అయినా ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ టాక్.  అన్నట్లు ఆమె ప్రస్తుతం తెలుగులో రామ్ సరసన 'పండగచేస్కో', రవితేజ సరసన 'కిక్2' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్-సుకుమార్ ల చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ