రామ్ చరణ్ కు అల్లు అర్జున్ సజెషన్..!

Tue 27th Jan 2015 05:09 AM
allu arjun,ram charan next fim,race gurram,surendar reddy  రామ్ చరణ్ కు అల్లు అర్జున్ సజెషన్..!
రామ్ చరణ్ కు అల్లు అర్జున్ సజెషన్..!
Advertisement
Ads by CJ

కేవలం తాను హిట్స్ లో ఉండటం, తాను ఆనందంగా ఉండటం కాదు.. తన బావ కూడా సక్సెస్ లు అందుకోవాలని.. ఆయన కూడా ఆనందంగా ఉండాలని బన్నీ భావిస్తున్నాడు. వాస్తవానికి వరుస చిత్రాలతో దూసుకెళ్ళుతున్న బావ మరిది చెర్రీకి 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో తన తదుపరి చిత్రం ఏ డైరెక్టర్ తో, ఏ జోనర్ లో చేయాలనేది అర్ధం కావడం లేదు. ఎట్టకేలకు ఆయన  శ్రీనువైట్లకు కమిట్ అయ్యాడు. కానీ అదే సమయంలో స్టార్ రైటర్స్ కోనవెంకట్,  గోపీమోహన్ లు చెర్రీకి ఓ స్టోరీ చెప్పారు. చెర్రీకి అది విపరీతంగా నచ్చేసింది. కోన, గోపీలను సలహా అడిగితే 'లౌక్యం' శ్రీవాస్ పేరు సూచించారట. కానీ చెర్రీ సంతృప్తి చెందలేదు. దీంతో కోన, గోపీలు ఇచ్చిన  స్టోరీకి ఏ డైరెక్టర్ అయితే న్యాయం చేయగలడు? అనే అనుమానంలో  ఉన్న రామ్ చరణ్ కు అల్లుఅర్జున్ సురేంద్ర రెడ్డి పేరు సూచించడం, బన్నీ మాటపై ఉన్న నమ్మకంతో చెర్రీ ఓకే చేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. తనకు కెరీర్ బెస్ట్ గా నిలిచిన 'రేసుగుర్రం' చిత్రాన్ని అందించిన సురేంద్ర రెడ్డి రామ్ చరణ్ కు కూడా కెరీర్ లో బెస్ట్ గా నిలిచే.. అంటే 'మగధీర'ను మించిన హిట్ ను అందిస్తాడని ఆశతో బన్నీ ఉన్నాడట.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ