Advertisementt

టీ-క్యాబినేట్‌లో పలు మార్పులు..!!

Sun 25th Jan 2015 08:57 AM
deputy cm kadiyam srihari,kcr,telangana ministers,new portfolios  టీ-క్యాబినేట్‌లో పలు మార్పులు..!!
టీ-క్యాబినేట్‌లో పలు మార్పులు..!!
Advertisement
Ads by CJ

రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించడంతో తెలంగాణ క్యాబినేట్‌లో పలు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజయ్య స్థానంలో డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరిని కేసీఆర్‌ ఎంపిక చేశారు. అయితే గతంలో రాజయ్య చూసిన వైద్యశాఖను కాకుండా కడియం శ్రీహరికి విద్యాశాఖను కేటాయించారు. అదే సమయంలో వైద్యశాఖను విద్యుత్‌శాఖ చూస్తున్న లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు. ఇక రాజయ్య స్థానంలో అదే వర్గానికి చెందిన కడియంను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసి కేసీఆర్‌ ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇక భవిష్యత్తులో రాజయ్య ఏంచేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా..? లేక బీజేపీ పార్టీ వైపు అడుగులు వేస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ