Advertisementt

కళ్యాణ్ రామ్ చేయనన్నాడట..!

Sun 25th Jan 2015 06:29 AM
athanokkade commercial success,kalyan ram,patas,anil raviupudi  కళ్యాణ్ రామ్ చేయనన్నాడట..!
కళ్యాణ్ రామ్ చేయనన్నాడట..!
Advertisement
Ads by CJ

'అతనొక్కడే' తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్  లేక ఇబ్బందులు పడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత బేనర్ లో అనిల్ రావిపూడి ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన చిత్రం 'పటాస్' మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందే యూనిట్ విజయం పై ఎంతో ధీమాగా ఉంది. ఈ చిత్రంలో నటించిన సాయి కుమార్ ఈ చిత్రం విడుదలకు ముందు మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో నటించాను. బాలయ్య బాబుతో ఎన్నో చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా ఆయన పోలీస్ పాత్ర చేసిన 'రౌడీ ఇన్ స్పెక్టర్' లో నటించాను. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక కళ్యాణ్ రామ్ తో చేసిన 'పటాస్' చిత్రంలో నటించాను. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుంది. ఈ విధంగా నందమూరి ఫ్యామిలీతో హ్యాట్రిక్ కొడతాను..  అన్న ఆయన నమ్మకాలను 'పటాస్' చిత్రం నిజం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... అనిల్ రావిపూడి స్టోరీ చెప్పిన వెంటనే కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో  చేద్దాం..  నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాను.. అని చెప్పాడట. కానీ అనిల్ మాత్రం ఈ పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని పట్టుబట్టడంతో ఈ చిత్రం చేశాడట. మొత్తానికి సినిమాకు హిట్ టాక్ రావడంతో యూనిట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే  అని ఒప్పుకోవాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ