Advertisementt

రకుల్ ట్వీట్స్ పబ్లిసిటీ కోసమా..!

Fri 23rd Jan 2015 12:00 PM
raviteja,rakul preeth singh,kick2,dual role,tweet  రకుల్ ట్వీట్స్ పబ్లిసిటీ కోసమా..!
రకుల్ ట్వీట్స్ పబ్లిసిటీ కోసమా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె ప్రస్తుతం రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కిక్2' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఇటీవల ఓ ట్వీట్ చేస్తూ... తాను 'కిక్2' చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా, సిటీగర్ల్ గా కనిపిస్తానంటూ.. చెప్పింది. దీంతో ఆమె ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆమె వాటిని ఖండించింది. తాను ఈ చిత్రంలో రెండు అవతారాల్లో కనిపిస్తాను గానీ ద్విపాత్రాభినయం చేయడం లేదు... అంటూ వివరణ ఇచ్చింది. ధియేటర్ లో నా పాత్రను చూసినప్పుడు మీరు థ్రిల్ గా ఫీలవుతారని ట్వీట్ చేసింది. దీన్ని చూసిన అందరూ ఆమె పబ్లిసిటీ గిమ్మిక్ కోసం ఇలాంటి ట్వీట్ లు  చేస్తోందంటూ విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా ఈ సినిమాపై అటేన్షన్ పెంచేందుకు ఆమె ఇలాంటి ట్వీట్ లు  పెడుతోందని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ