Advertisementt

రామ్ చరణ్ అయినా లెక్కలేదంటోంది..!

Thu 22nd Jan 2015 05:34 AM
ram charan,sreenuvaitla,special song,anjali,remuneration  రామ్ చరణ్ అయినా లెక్కలేదంటోంది..!
రామ్ చరణ్ అయినా లెక్కలేదంటోంది..!
Advertisement
Ads by CJ

త్వరలో రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని సస్పెన్స్ అండ్ కామెడీ జోనర్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. కామెడీ కూడా శ్రీను వైట్ల గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించేందుకు హీరోయిన్ అంజలిని సంప్రదించగా ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో కంగుతిన్న యూనిట్ ఆమె రేటును తగ్గించే విధంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ అంజలి మాత్రం చాలా కూల్ గా తాను అనుకున్నది సాధించుకునే పనిలో ఉందట. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ పాత్రకు సమంతను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గా 'మై నేమ్ ఈజ్ రాజు'ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ