తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు వాస్తు, జ్యోతిష్యంపై ఈమధ్య నమ్మకం మరి ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తు దోషం పేరుతో ముఖ్యమంత్రుల కార్యాలయాలకు, వారి అధికార నివాసాలకు కోట్లు ఖర్చుపెట్టించి మరమ్మతులు చేయించడంలో బాబు, కేసీఆర్ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఇక నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి వెళితే పదవి గండం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరించడంతోనే బాబు అక్కడికి వెళ్లలేదనే విమర్శలు వినబడుతున్నాయి. మరోవైపు తాను ఎంత సుపరిపాలన గావిస్తున్నా.. ప్రజాభిమానం చురగొనడం లేదని బాధపడుతున్న కేసీఆర్ ఇక లాభం లేదని మళ్లీ వాస్తును నమ్ముకున్నాడు. వాస్తు పండితుడు సుద్దాల సుధాకర్ తేజను ఆగమేఘల మీద రప్పించి సచివాలయం, బేగంపేటలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలను పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఇక సుధాకర్ తేజ రెండుగంటలపాటు సచివాలయాన్ని క్షుణ్నంగా పరిశీలించి కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం.