Advertisementt

తమిళంలో హిట్ కొట్టిన తెలుగు ప్రొడ్యూసర్..!

Mon 19th Jan 2015 05:34 AM
kollywood,comedy,prema kadha chithram,darling,gnanavel,allu aravind  తమిళంలో హిట్ కొట్టిన తెలుగు ప్రొడ్యూసర్..!
తమిళంలో హిట్ కొట్టిన తెలుగు ప్రొడ్యూసర్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హర్రర్ కామెడీ చిత్రాల హవా కొనసాగుతోంది. తెలుగులో 'ప్రేమకధా చిత్రమ్' గా వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె. ఇ. జ్ఞాన వేల్ లు సంయుక్తంగా తమిళంలోకి 'డార్లింగ్' పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జి. వి. ప్రకాష్ హీరోగా నటించాడు. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని భారీ విజయం దిశగా పరుగులు పెడుతోంది. మొత్తానికి 25 ఏళ్ళ గ్యాప్ తర్వాత మరలా తమిళంలో హిట్ కొట్టడంతో అల్లు అరవింద్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. కాగా ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించడం విశేషం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ