Advertisement

'గోపాల గోపాల' లో పోసాని పాత్రే హైలైట్ అంట!!

Fri 09th Jan 2015 03:32 AM
posani krishna murali,gopala gopala,highlights,pawan kalyan,comedy  'గోపాల గోపాల' లో పోసాని పాత్రే హైలైట్ అంట!!
'గోపాల గోపాల' లో పోసాని పాత్రే హైలైట్ అంట!!
Advertisement

పవనకల్యాన్, వెంకటేష్ ల కాంబినేషన్ లో  రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'గోపాల గోపాల' పై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి.కాగా ఈ చిత్రాన్ని 9వ తేదీన విడుదల చేయనున్నట్లు నిన్నటివరకు ప్రచారం జరిగింది.కానీ సెన్సార్ కార్యక్రమాలతోపాటు మరి కొంత వర్క్ ఆలస్యం కావటంతో ఈ చిత్రాన్ని 10వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన,ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో  పోసాని కృష్ణమురళి పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. 'ఓ మైగాడ్' చిత్రంలో గోవింద నమోడే చేసిన పాత్రను ఇక్కడ పోసాని పోషిస్తున్నాడు. ఈ పాత్రకు నెగటివ్ టచ్ ఇచ్చి మరీ హైలైట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. దొంగ స్వామిగా పోసాని తనదైన స్పెషల్ డైలాగ్ డెలివరీతో ఆదరగొట్టాడని ఇన్ సైడ్ టాక్.త్వరలో ఈ పాత్రకు చెందిన డైలాగులతో ట్రైలర్ వదలనున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement