పవన్ లో మార్పుకు కారణం ఎవరు..!

Tue 06th Jan 2015 03:01 AM
media,social net working,pawan kalyan,twitter,account,open,renudesai,convince,social media,tweet,satire,support  పవన్ లో మార్పుకు కారణం ఎవరు..!
పవన్ లో మార్పుకు కారణం ఎవరు..!

మీడియాకు, సోషల్ నెట్ వర్కింగ్ మీడియాకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ కొత్త సంవత్సరం సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అసలు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన మాజీ భార్య, నటి, దర్శకులు, నిర్మాత అయిన రేణుదేశాయ్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత మూడు నెలల నుండి ఆయన్ను కన్విన్స్ చేస్తున్నానని, కమ్మూనికేషన్ విషయంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎంతో ఉంది. మొత్తానికి ఆయన ట్విట్టర్ విషయంలో కన్విన్స్ అయ్యారు.. అంటూ ట్వీట్ చేసింది. మెగాభిమానులకు ఇంత సహాయం చేసి, వారిలో ఆనందాన్ని నింపిన రేణుదేశాయ్ మనసు వెన్న అని, ఇప్పటికీ పవన్ బాగోగులు కోరుకుంటున్న ఆమెపై ఇక ద్వేషం వదిలి అందరూ ఆమెకు సపోర్ట్ చేయాలని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి రేణుదేశాయ్ కయినా మీడియా అవసరం ఏమిటి? ఆవశ్యకత ఏమిటి? అనే విషయంలో సరైన అవగాహన ఉండటం సంతోషమేగా మరి..!