రామ్ చరణ్ మరో సినిమా ఖరారైంది..!

Tue 06th Jan 2015 02:21 AM
megapower star,ram charan,sreenuvaitla,pre production,shooting,kona venkat,twitte,gopi mohan,story,fun and heroism,hot topic,kick,race gurram  రామ్ చరణ్ మరో సినిమా ఖరారైంది..!
రామ్ చరణ్ మరో సినిమా ఖరారైంది..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెలాఖరు నుండి షూటింగ్ ప్రారంభించుకునే అవకాసం వుంది. కాగా రామ్ చరణ్ మరో చిత్రం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కోనవెంకట్, గోపీమోహన్ లు కథను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోనవెంకట్ వెల్లడిస్తూ.. నేను గోపిమోహన్ కలిసి రామ్ చరణ్ కోసం కథను రెడీ చేస్తున్నాం. కథ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు ఓ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడు. అతడు ఎవరనే విషయం త్వరలో వెల్లడిస్తాం. ఈ దర్శకుని కోసం నేను, గోపీమోహన్ కలిసి తొలిసారి పనిచేస్తున్నాం. ఇది చాలా ఫ్రెష్ స్టొరీ.. ఫన్ అండ్ హీరోయిజం కలగలిసిన స్టొరీ.. అని కోనవెంకట్ తెలిపాడు. కోనవెంకట్ చెప్పిన ఆ దర్శకుడు ఎవరు? అనే విషయమై ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. అతను 'కిక్, రేసుగుర్రం' చిత్రాల డైరెక్టర్ సురేంద్రరెడ్డి అని అందరూ బలగుద్ది చెబుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.