Advertisement

చుక్కలు చూపిస్తోన్న కాజల్..!

ఎక్కడైనా బావే కానీ.. వంగతోట కాడ మాత్రం కాదు.. అనే నానుడి టాప్ హీరోయిన్ కాజల్ కు బాగా వర్తిస్తుంది. ఆమె ఏ విషయంలో అయినా రాజీ పడుతుందేమో గానీ, రెమ్యునరేషన్ విషయంలో మొహమాటాలకు పోదు. తాను అనుకున్నది సాధించుకునేదాకా ఆమె పట్టువీడదు. తాజాగా ఆమె ఎన్టీఆర్ సరసన పూరీజగన్నాధ్ తెరకేక్కిస్తోన్న 'టెంపర్' చిత్రానికి కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత బండ్లగణేష్ ఆమె అడిగిన పారితోషికం ఇస్తానని చెప్పడంతో ఆమె పట్టు వీడింది. తాజాగా ఆమె తమిళంలో ధనుష్ సరసన ఓ చిత్రంలి నటించడానికి ఒప్పుకుంది. ఈ చిత్రానికి కూడా ఆమె భారీగానే వసూలు చేసిందని కోలీవుడ్ సమాచారం. కాగా ఇటీవల ఓ కండోం యాడ్ కంపెనీ తమ ప్రచారకర్తగా కాజల్ ను తీసుకోవాలని నిర్ణయించుకొని ఆమెను సంప్రదిస్తే ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసిందట. పూర్తిగా ఓ సినిమాలో హీరోయిన్ గా చేయడానికే ఆమె అంత మొత్తం తీసుకోవడం లేదని, మరి రెండు నిమిషాల యాడ్ కోసం ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడం ఏమిటని? కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె ఈ యాడ్ ను ఒప్పుకుంటుందో లేదో రెండుమూడు రోజుల్లో తేలిపోతుంది. 

top heroin
kajal
remuneration
ntr
puri jagannaadh
temper
bandla ganesh
dhanush
kollywood
condom add
comments