Advertisement

టీఆర్‌ఎస్‌లో ఎంతలో ఎంత మార్పు..??

Wed 31st Dec 2014 06:53 AM
  టీఆర్‌ఎస్‌లో ఎంతలో ఎంత మార్పు..??
టీఆర్‌ఎస్‌లో ఎంతలో ఎంత మార్పు..??
Advertisement
>టీఆర్‌ఎస్‌లో ఎంతలో ఎంత మార్పు. ఒకప్పుడు విద్యార్థులే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, వారే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలరని కేసీఆర్‌తోసహా మిగిలిన నాయకులంతా ఊదరగొట్టారు. తీరా రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల గురించి విద్యార్థులు ప్రశ్నిస్తే.. హరీష్‌రావు అంతటి వాడే ఇడియట్స్‌ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక నిన్న కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లాలో విద్యార్థులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి దిగారు. 

>దీంతో ఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విద్యార్థుల్లో ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఓవైపు చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, మరోవైపు చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు చెల్లించకపోవడంతో విద్యార్థిలోకం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలలకు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఏర్పడింది. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కనీసం ఇంకో ఆరు నెలల సమయం కావాలని సర్వీసు కమిషన్‌ స్పష్టం చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చి పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చి.. ఉద్యోగంలో చేరడానికి ఇంకెంత సమయం పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ తరుణంలోనే విద్యార్థులు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. ఇక మంగళవారం  కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లాలోజరిగిన ఆందోళనలో విద్యార్థులను టీఆర్‌ఎస్‌ నాయకులు చితకబాదారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇన్నాళ్లు ఉద్యమం పేరుతో తమను వాడుకున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడేమో ఉద్యోగాల గురించి అడిగితే చితకబాదుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement