Advertisementt

బాలయ్య వందో చిత్రం ఖరారైనట్లే..!

Wed 31st Dec 2014 04:23 AM
balakrishna,kodi ramakrishna,b.gopal,boyapati sreenu,hits,simha,legend,sathyadeva,lakshyam fame,natasimham,100 movie,275 days  బాలయ్య వందో చిత్రం ఖరారైనట్లే..!
బాలయ్య వందో చిత్రం ఖరారైనట్లే..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణకు గతంలో కోడిరామకృష్ణ, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ వంటి డైరెక్టర్ల తో అద్భుతమైన హిట్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నేటితరం దర్శకుల్లో ఎవ్వరూ బాలయ్యకు సరిగా సూట్ కాలేదు. బాలయ్యను ఎలా? ఎక్కడ? చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అనే విషయంలో సినీ ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో చాలా మంది ఫెయిలయ్యారు. అయితే బోయపాటి శ్రీను మాత్రం బాలయ్యను ఎలా చూపించాలో బాగా అర్ధం చేసుకొని, ఈ తరంలో 'సింహా, లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్స్ ను అందించాడు. కాగా బాలయ్య ప్రస్తుతం 98వ చిత్రం చేస్తున్నాడు. సత్యదేవా అనే నూతన దర్శకునితో ఈ చిత్రం చేస్తోన్న బాలయ్య తన 99వ చిత్రంగా 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ తో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు. తాజాగా బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ స్టొరీ తయారు చేసానని బోయపాటి స్వయంగా తెలపడం విశేషం. కాగా ఇటీవల జరిగిన 'లెజెండ్' 275 రోజుల వేడుకలలో కూడా అతిథులందరూ బాలయ్యతో బోయపాటి వందో చిత్రం చేయాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య నటించే 100వ చిత్రానికి బోయపాటి దర్శకుడు అనే విషయం దాదాపు ఖరారైనట్లేనని ఫిల్మ్ నగర్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ