Advertisementt

సుదీప్ తో 'లింగ' దర్శకుడి చిత్రం..!

Sat 27th Dec 2014 04:57 AM
kannada,sudeep,eega,linga,ravi kumar,south,stardom,raajmouli,baahubali,guest role  సుదీప్ తో 'లింగ' దర్శకుడి చిత్రం..!
సుదీప్ తో 'లింగ' దర్శకుడి చిత్రం..!
Advertisement
Ads by CJ

కన్నడ స్టార్ హీరో సుదీప్ 'ఈగ' చిత్రం ద్వారా దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.తాజాగా సుదీప్ ఒక బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడట. 'లింగ' దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్నాడని కన్నడ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రం 'లింగ' కంటే ముందే ప్రారంభం కావాల్సివుంది. 'లింగ' ప్రాజెక్ట్ ఓకే కావడంతో రవికుమార్ ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు 'లింగ' చిత్రం విడుదల కూడా అయిపోవడంతో కె.ఎస్.రవికుమార్ సుదీప్ సినిమాపై దృష్టి సారించాదట. రవికుమార్ చిత్రంతో సౌత్ లో తనకి స్టార్ డం మరింతగా పెరుగుతుందని సుదీప్ ఆశిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో సుదీప్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ