Advertisementt

మ‌మ్మీ కాబోతున్న పాపుల‌ర్ న‌టి

Sun 21st Sep 2025 10:21 AM
katrina kaif  మ‌మ్మీ కాబోతున్న పాపుల‌ర్ న‌టి
Katrina Kaif and Vicky Kaushal expecting their first child మ‌మ్మీ కాబోతున్న పాపుల‌ర్ న‌టి
Advertisement
Ads by CJ

క‌త్రిన కైఫ్ - విక్కీ కౌశ‌ల్ జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే. ఈ జంట‌కు పెళ్ల‌యి నాలుగేళ్ల‌యింది. 2021లో వివాహం జ‌రిగింది. అయితే గడిచిన ఏడాది కాలంగా విక్ కాట్ పై ఒత్తిడి పెరిగింది. ఈ జంట త‌మ కుటుంబాన్ని పెంచుకునేది ఎప్పుడు? అంటూ ప్ర‌శ్న‌లతో విసిగించ‌డం మొద‌లైంది. ఎట్ట‌కేల‌కు అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు సిద్ధంగా ఉందని క‌థ‌నాలొస్తున్నాయి.

తాజాగా క‌త్రిన బేబి బంప్ ఫోటోలు వెబ్ లోకి లీక‌వ్వ‌డంతో ఇది చ‌ర్చ‌గా మారింది. కత్రినా తన మూడవ త్రైమాసికంలో ఉంది.. వచ్చే నెలలో బిడ్డ పుట్టనుందని క‌థ‌నాలొస్తున్నాయి. బాలీవుడ్ హంగామా క‌థ‌నం ప్రకారం.. తొమ్మిదో నెల ముగిసి, ప‌దో నెల‌లో బిడ్డ‌ను క‌నేందుకు దీపిక సిద్ధ‌మ‌వుతోంది. అక్టోబర్ 15 మరియు అక్టోబర్ 30కి మ‌ధ్య‌లో శుభవార్త‌ను చెబుతుంది. విక్కీ ప్ర‌స్తుతానికి చ‌ప్పుడు చేయ‌కుండా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత దాని గురించి ప్రకటించాలనుకుంటున్నారు..అని తెలుస్తోంది.

అయితే విక్ కాట్ ఇంకా ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. మెర్రీ క్రిస్మ‌స్ సినిమా త‌ర్వాత క‌త్రిన పూర్తిగా సినిమాల నుంచి దూర‌మైంది. టైగ‌ర్ 3 లాంటి యాక్షన్ చిత్రంలోను న‌టించింది. కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలొచ్చినా న‌టించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ పైనే దృష్టి సారించింది. 

Katrina Kaif and Vicky Kaushal expecting their first child:

  Katrina Kaif - Vicky to share pregnancy announcement  

Tags:   KATRINA KAIF
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ