ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse Says She Is Ready for Any Acting Challenge

నటిగా ఏ ఛాలెంజ్‌కైనా రెడీ అంటున్న భాగ్యశ్రీ

Bhagyashri Borse Says She Is Ready for Any Acting ChallengeBhagyashri Borse Says She Is Ready for Any Acting Challenge

 

`మిస్టర్ బచ్చన్` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై వరుస అవకాశాలతో దక్షిణాది పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే . అమ్మ‌డు   ఎంచుకునే పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే తరహా పాత్రలకే పరిమితం  అయిపోతాననే భయం తనకు లేదని.. ఎలాంటి విభిన్నమైన పాత్రనైనా పోషించి దానికి పూర్తి న్యాయం చేయగలననే నమ్మకం ఉంద‌ని  తన నటనపై ఉన్న నమ్మకాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఒక నటిగా ప్రతి సినిమాతో నేర్చుకుంటూ ముందుకు సాగడమే తన లక్ష్యమని భాగ్యశ్రీ తెలిపారు. ఇప్పటికే పీరియాడికల్ డ్రామా `కాంత`.. గ్రామీణ నేపథ్యంలో సాగే `లెనిన్`,  విజయ్ దేవరకొండ న‌టించిన `కింగ్‌డమ్` లాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించానన్నారు. అలాగే యాక్షన్ థ్రిల్లర్ మోహన్‌లాల్ చిత్రం `ఆపరేషన్ గంగా`తో కూడా తన ప్రయాణం సాగుతోందని వెల్లడించారు.

గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా బలమైన ప్రాధాన్యత ఉన్న విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడానికే తానెప్పుడు ప్రాధాన్యత ఇస్తానని భాగ్యశ్రీ వివరించారు. నటిగా తనలో ఉన్న వేర్వేరు కోణాలను ఆవిష్కరించే ప్రయోగాలకు తానెప్పుడు  సిద్ధంగా ఉంటానన్నారు.  ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. 

Bhagyashri Borse Is Ready to Take on Any Role