ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Is Rohith’s Graph Finally Slipping?

బిగ్ బాస్ 10: పడిపోతున్న రోహిత్ గ్రాఫ్

Bigg Boss 10: Is Rohith’s Graph Finally Slipping?Bigg Boss 10: Is Rohith’s Graph Finally Slipping?


అగ్నిపరీక్ష సీజన్ 2 లో గెలిచి బిగ్ బాస్ హౌస్ లోకి రాయల్ గా అడుగుపట్టిన రోహిత్ గత నాలుగు వారాలు ఆటలో అదిరిపోయే పోటుగాడిగా కనిపించాడు. త్రిగున్ లాంటి వాడిని హౌస్ లో తట్టుకుని నిలబడింది రోహిత్ ఒక్కడే. నాగార్జున బిగ్ బాస్ డోర్స్ తీసి గెటౌట్ అన్నా రోహిత్ ని ఆడియన్స్ ఆదరించి ఓట్లు వేసి నామినేషన్స్ లో టాప్ లో నించోబెట్టారు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది. కారణం షాలిని. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన షాలిని చుట్టూ తిరుగుతూ రోహిత్ ఆట ని చెడగొట్టుకుంటున్నాడు అనేది బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇస్తున్న వారి మాట. వైల్డ్ కార్డ్స్ టార్గెట్ చేసిన తీరు. షాలిని తో గంటలు గంటలు కాదు కాదు నైట్ మొత్తం మట్లాడడమే కాదు, ఎప్పుడు ఆమెను అంటిపెట్టుకుని ఉంటున్నాడు.

ఆటలో ఫోకస్ పెట్టడం లేదు, రోహిత్ పొటన్షియాలిటీని బయటపెట్టకుండా షాలిని షాడోలా మారిపోయాడు. అతని వేసిన పాచిక పారడం లేదు, అమన్ లాంటి వాళ్ళు రోహిత్ మాట విన్నట్టే ఉంటున్నారు. కానీ త్రిగున్ తో చేరి అమన్ దూసుకుపోతున్నాడు. కానీ తెలివి ఉన్న రోహిత్ షాలిని మాయలో పడిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తే రోహిత్ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్లుగా అనిపిస్తుంది.

ఆఖరికి వైల్డ్ కార్డు లు మొత్తం షాలిని - రోహిత్ లను వేలెత్తి చూపినా వాళ్లలో నో చేంజ్. టాప్ 5 కేండేట్ కాదు కప్ గెలిచే సత్తా ఉన్న రోహిత్ ఇప్పుడు టాప్ 5 లో ఉంటాడా అనే డౌట్ ని అందరూ పడుతున్నారు. షాలిని తో తిరగడం ఆపేస్తే రోహిత్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాడు. లేదంటే ఇప్పుడొచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలకి బుక్ అవుతాడు అంటూ రోహిత్ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss 10: Rohith’s Game Is Losing Its Spark