ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No Buzz Around Jailer 2 Telugu Version

జైలర్ 2: తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కడా?

No Buzz Around Jailer 2 Telugu VersionNo Buzz Around Jailer 2 Telugu Version

 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ చిత్రం సింపుల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కూర్చుంది. ఏ లాంగ్వేజ్ లో విడుదలైనా అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పటికి టీవీ లో జైలర్ వస్తుంది అంటే ఆడియన్స్ లో క్రేజ్ కనిపిస్తుంది. అంతేకాదు జైలర్ తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఇప్పుడు జైలర్ కి సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 ఈ నెల 15 న దసరా స్పెషల్ గా గురువారం విడుదల కాబోతుంది. అయితే తమిళనాట జైలర్ 2పై ఉన్న క్రేజ్ తెలుగులో కనిపించడం లేదు. జైలర్ 2కి తెలుగు ప్రమోషన్స్ పెద్దగా ఉండవు. కారణం రజిని సర్ వచ్చి ప్రమోట్ చెయ్యరు. అయితే జైలర్ 2 ట్రైలర్ తో సినిమాపై హైప్ వస్తుంది అనుకుంటే... అదీ కనిపించలేదు.

జైలర్ 2 ట్రైలర్ తెలుగు ఆడియన్స్ పై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. జైలర్ 2 ట్రైలర్ చూసి తెలుగు ప్రేక్షకులు బాగా డిజప్పాయింట్ అయ్యారు, ఇప్పుడు టికెట్ రేట్స్ హైక్ జైలర్ 2 కి మైనస్ అయ్యింది. జైలర్ 2 టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినా ఆ బుకింగ్స్ లో స్పీడు కనిపించడం లేదు.

మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న జైలర్ 2 పై తెలుగు ఆడియన్స్ లో ఎంత ఆసక్తిని క్రియేట్ చేస్తుందో, ఏమేరకు ఓపెనింగ్స్ తెస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Why Jailer 2 Telugu Version Muted