ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: This Week’s Nominations List

బిగ్ బాస్ 10: ఈ వారం నామినేషన్స్ లిస్ట్

Bigg Boss Telugu 10: This Week’s Nominations ListBigg Boss Telugu 10: This Week’s Nominations List


బిగ్ బాస్ సీజన్ 10 గత ఆదివారమే స్టార్ మా లో మొదలయ్యింది. గత సీజన్ వలె కామనర్స్ vs సెలబ్రిటీస్ అంటూ రెండు జట్టులుగా విడదీశారు హౌస్ లో. అగ్నిపరీక్ష 2 లో టాలెంట్ ప్రూవ్ చేసుకుని కామనర్స్ గా చాలామంది హౌస్ లోకి అడుగుపెట్టారు. సెలబ్రిటీస్ ఇంకా కామనర్స్ కలిపి 16 మంది హౌస్ లోకి వెళ్లారు.

ఇక వెళ్లివారు అప్పుడే తమ తమ ఆట మొదలు పెట్టేసారు. రచ్చ స్టార్ట్ చేసేసారు. చిన్న విషయాలకే గొడవ పడడం, పనుల విషయంలో గొడవలు తో మొదటి వారం నామినేషన్స్ లోను సెలబ్రిటీస్ vs కామనర్స్ మద్యన వార్ బాగానే జరిగింది.

ఇక ఈ వారం మేజిక్ కీలు గెలుచుకునేందుకు పెట్టిన టాస్క్‌లలో జరిగిన ఘటనలు, హౌస్‌లో పనులు పంచుకునే విధానం బట్టి హౌస్ మేట్స్ నామినేషన్స్ వేసినట్లుగా తెలుస్తుంది. బిగ్‌బాస్ తెలుగు 10లో మొదటి వారం సెలబ్రిటీలు, కామనర్స్ సహా మొత్తం 16 మంది నామినేషన్స్‌లో ఉన్నారట.

అంటే హౌస్ మొత్తం ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. చివరిలో టాస్క్‌లు, గేమ్స్, మేజిక్ పవర్ ఆధారంగా వీరు ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వస్తారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు అని తెలుస్తుంది.

Bigg Boss Telugu 10: First Week Nomination List