ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> King 100 Could Change Chaitu’s Vrushakarma Plans

చైతూకి నాగార్జున ‘కింగ్ 100’ షాక్?

King 100 Could Change Chaitu’s Vrushakarma PlansKing 100 Could Change Chaitu’s Vrushakarma Plans


అక్కినేని యువ హీరో నాగ చైతన్య - విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కలయికలో తెరకేకున్న వృషకర్మ చిత్రం ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చనే వార్త అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. ముందుగా వృషకర్మ డిసెంబర్లో అందులోను క్రిస్మస్ పై కన్నెసినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ ఇప్పుడు కింగ్ నాగార్జున #King 100 అదే డిసెంబర్ 24 కే విడుదల కాబోతుంది. దానితో నాగ చైతన్య తండ్రి సినిమాకి పోటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే వృషకర్మ ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చు.. అలాగే సంక్రాంతి బరిలోకి కూడా వృషకర్మ రాదు. ఇప్పటికే సంక్రాంతి 2027 బాక్సాఫీసు బరి హీటెక్కింది.

దీనిని బట్టి నాగ చైతన్య తన వృషకర్మ ను 2027 ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యొచ్చని తెలుస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతు కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

Vrushakarma Release Likely Pushed to 2027