వెంకీ అట్లూరి నెక్స్ట్ టార్గెట్
Venky Atluri’s Next Target
లక్కీ భాస్కర్ తో రూ.100 కోట్లు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.250 కోట్లు కొల్లగొట్టిన క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కొన్నాళ్ళుగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. సర్ తో కోలీవుడ్ హీరో ధనుష్ తో సినిమా చేసిన వెంకీ అట్లూరి మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రాన్ని చేశారు.
ఆతర్వాత కూడా తెలుగు నిర్మాతను తీసుకెళ్లి కోలీవుడ్ హీరో సూర్య తో విశ్వనాథ్ అండ్ సన్స్ చేసారు. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వెంకీ అట్లూరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు. ఈసారి అయినా తెలుగు హీరోతో సినిమా చేస్తారా, లేదంటే పరభాషా హీరోని వెతుక్కుంటారా అనే అనుమానాలు అందరిలో కనిపిస్తున్నాయి.
లక్కీ భాస్కర్ సీక్వెల్ త్వరలోనే అంటూ వెంకీ అట్లూరి చెబుతున్నారు, కానీ అది ఎప్పటికి రావాలి. వెంకీ అట్లూరి రూ.100, రూ.200 ఇకపై ఆయన టార్గెట్ ఎంత, ఏ భాష హీరోతో తదుపరి సినిమా చేస్తారు.. స్టార్ హీరోలెవరైనా ఆయనకు ఛాన్స్ ఇస్తారా, ఈసారి ఎలాంటి కథతో వస్తారు అనే విషయంలో ఆయనపై ఓ పక్క ట్రేడ్ లో అంచనాలు, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మాత్రం బాగా పెరిగిపోతున్నాయి.







































