ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో శ్రియ సంచలనం!
Shriya Creates a Buzz With Her Instagram Post
సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అద్భుతమైన జోడీగా పేరు తెచ్చుకున్న నటి శ్రియా సరన్ మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు త్వరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయబోతున్నారనే ఊహాగానాలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల శ్రియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫొటోలు ..హింట్స్ ఈ కాస్టింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోశాయి.
రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మాతగా `దర్మన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రియ హీరోయిన్ గా ఎంపికైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సెట్స్ లో ఉన్న చిత్రం మూడవ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఆ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రియ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మరి ఇందులో ఆమె నటిస్తుందా? లేదా? అన్నది మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. రజనీకాంత్ తో ఇప్పటికే శ్రియ `శివాజీ` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్లోబల్ వైడ్ మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో శియ-రజనీకాంబినేషన్ కు మంచి గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే కాంబినేషన్ లో సినిమా ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.







































