ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Venkatesh,Kalyan Ram Film Titled January 12 Vidudala

రావిపూడి మార్క్ టైటిల్ తో డేట్ ఫిక్స్

Venkatesh,Kalyan Ram Film Titled January 12 Vidudala

 

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, తాజాగా మేకర్స్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఇప్పటివరకు #VenkyAnil5 / #NKRAR2 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో రూపొందించిన వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ట్రిబ్యూట్ ఇస్తూ, ఆయన తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని ఓ పాపులర్ కామెడీ సీక్వెన్స్‌ను గుర్తు చేసేలా మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ అనిల్ రావిపూడికి ఎంతటి ఇన్‌స్పిరేషన్ అనేది తెలిసిందే. మరోసారి తనదైన స్టైల్‌లో ఆయనపై ఉన్న అభిమానాన్ని ఈ వీడియో ద్వారా చూపించారు. ఆ తర్వాత టైటిల్ రివీల్‌కి తీసుకెళ్లిన విధానం కూడా ఆకట్టుకుంది.

వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లి సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. వెంటనే అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని చెప్పడంతో వాళ్లంతా కన్ఫ్యూజ్ అవుతారు. తాము రిలీజ్ డేట్ గురించి కాదు.. సినిమా టైటిల్ గురించి అడుగుతున్నామని క్లారిటీ గా చెప్తారు. ఆ తర్వాత జరిగే ఫన్‌ఫుల్ కన్వర్జేషన్, కామెడీ బాంటర్‌తో వీడియో ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. చివరికి ‘జనవరి 12 విడుదల’ నే సినిమా టైటిల్ అని రివీల్ చేయడం ఆకట్టుకుంది.

మొత్తం వీడియోలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, టైమింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో కూడా ఓ ఫన్‌ఫుల్ గ్లింప్స్ ఇచ్చింది. టైటిల్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మధ్య సినిమాలో ఉండే రిలేషన్‌ను హైలెట్ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌ మరింత ఆకట్టుకుంది.

మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. టైటిల్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ఖరారు చేశారు. 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన సీజన్.   పండుగ సీజన్‌లో ఆయన సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.

 

Venkatesh,Kalyan Ram, Anil Ravipudi Film Titled January 12 Vidudala