రాంగోపాల్ వ‌ర్మ సినిమాతో డీసీ పోలిక‌!

Comparison between DC and SatyaComparison between DC and Satya

 

స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా లాంచ్ అయిన డీసీకి రివ్యూలు అనుకూలంగా లేక‌పోయినా?  మౌత్ టాక్ ప‌రంగా సినిమా దూసుకుపోతుంది. డైరెక్ట‌ర్ గా లోకేష్ ఇమేజ్ తెలిసిన వారంతా థియేట‌ర్ వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. సాధారణ ప్రేక్షకులే  కాకుండా సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ శంకర్ ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ సంచలన సృష్టికర్తగా నిలిచిన కల్ట్ క్లాసిక్ `సత్య`తో పోల్చడం  ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం తిరువనంతపురంలోని `క్రిపా` థియేటర్‌లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన `సత్య` సినిమా చూసిన క్షణాలను రంజిత్ శంకర్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఆ సినిమా తనపై చూపిన తీవ్రమైన ప్రభావాన్ని సినిమా ముగించు బయటకు వచ్చినప్పుడు మేకింగ్ పరంగా తాను ఎంతగా ఆశ్చర్యపోయానో?  సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సరిగ్గా అదే  ಅనుభూతిని తాజాగా  `డిసి` సినిమా చూసినప్పుడు కూడా  పొందానని  కొనియాడారు.

ఒక సినిమా చూశాక దాని ఇంపాక్ట్ గుండెల్లో అలాగే నిలిచిపోతుందనడానికి ఈ చిత్రమే నిదర్శనమని రంజిత్ శంకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు డైరెక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో పూర్తి స్థాయి హీరోగా న‌టించి అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు. సినిమాలోని హింస, భావోద్వేగాలు , మేకింగ్ స్టైల్ ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉన్నాయని అందుకే ఈ సినిమా తనకు క్లాసిక్ మూవీ `స‌త్య‌`ను గుర్తు చేసిందని  పేర్కొన్నారు.  

Comparison between DC and RGV Satya