బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన సంచలన నటుడు!
Emraan Hashmi on acting in biopic
ప్రముఖ నటులకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, పుకార్లు వైరల్ కావడం పరిశ్రమలో సర్వ సాధారణం. అయితే కొన్నిసార్లు ఎలాంటి ఆధారాలు లేని వార్తలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంటాయి. తాజాగా ఇమ్రాన్ హష్మీపై వస్తున్న బయోపిక్ వార్తలపై ఆయన స్పందిచారు. తాను ఏ బయోపిక్‌లోనూ నటించడం లేదని..ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు.
కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, ఊహాగానాల ఆధారంగా ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని కొట్టిపారేశారు. భవిష్యత్తులో తాను చేయబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలన్నీ తన టీమ్ లేదా నిర్మాణ సంస్థల ద్వారానే వస్తాయని, ఇలాంటి అనధికారిక పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరారు.
ఈ స్పష్టతతో హష్మీ తదుపరి సినిమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి రూమర్స్ వచ్చినా సకాలంలో స్పందించి క్లారిటీ ఇవ్వడం ద్వారా అభిమానుల్లో నెలకొన్న గందరగోళానికి తెర దించినట్లు అవుతుంది. ఇంతకీ ఇమ్రాన్ హష్మీ ఎవరి బయోపిక్ లో నటిస్తున్నాడనే ఈ కథనాలు వస్తున్నాయంటే? మ్యూజిక్ కంపోజర్ ఆర్. డి బుమ్రాన్ జీవిత కథలో నటిస్తున్నాడనే ప్రచారం నేపథ్యంలోనే హష్మీ క్లారిటీ ఇచ్చారు.







































