సూపర్‌హీరో అవ్వాలని స్టార్ హీరో అంత రిస్కు
Star Hero Risking Evreything
సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే హీరోలు ఫిజిక్‌ను విపరీతంగా మార్చుకోవడం ఈమధ్య కాలంలో భారతీయ చిత్రసీమలో సర్వసాధారణమైపోయింది. క్రమశిక్షణతో కూడిన వర్కౌట్లు.. సరైన డైట్ ద్వారానే చాలామంది హీరోలు బాడీ బిల్డింగ్ చేస్తున్నా కానీ.. కొందరు వేగవంతమైన ఫలితాల కోసం స్టెరాయిడ్స్ వైపు మొగ్గు చూపుతారని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్స్ వాడటం వల్ల గుండె సమస్యలు, కిడ్నీ రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ముంచుకొస్తాయని వారు గుర్తుచేస్తున్నారు.
అయితే ఇదంతా చెప్పుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. టాలీవుడ్ లో భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించే స్టార్ హీరో లార్జర్ దేన్ లైఫ్ పాత్రల కోసం తన రూపాన్ని మార్చుకోవడానికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని దానివల్ల ఒక్కోసారి స్టెరాయిడ్స్ ఉపయోగించి రిస్కు చేసారని గుసగుస వినిపిస్తోంది. ఈ స్టెరాయిడ్స్ వినియోగం వల్ల అతడి ఆరోగ్యం దెబ్బ తినడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల చిత్రీకరణలకు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడే ఛాన్సుందనే గుసగుస వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో మరియు సినీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యవహారంపై సదరు నటుడి నుండి గానీ, అధికారిక టీమ్ నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదా వివరణ వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతానికి ఇలాంటి వార్తలను కేవలం నిరాధారమైన పుకార్లుగానే చూడాలి.
ఆ హీరో ఎవరు అనేది అటుంచితే... స్టార్ హీరోల మీద పాన్ ఇండియా ప్రెజర్ ఏ రేంజులో ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ తరహా లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను చేయాలంటే స్టార్ హీరోలు చాలా శ్రమించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రిస్కులు తీసుకుని ఆరుపలకల రూపాన్ని తేవడం కోసం లేదా బల్క్ ఫిజిక్ ని ఆవిష్కరించడం కోసం కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థమవుతోంది.
అయితే ఏదైనా లార్జర్ దేన్ లైఫ్ పాత్రను ఎంపిక చేసుకుంటే తమ రూపాన్ని తక్కువ సమయంలో మార్చుకోవాలని హీరోలు ఆశించకూడదు. అవసరం మేర ఫిజికల్ ట్రైనర్ సలహాలు తీసుకుని దానిని పాటించేందుకు ప్రయత్నించాలి. అలాగే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల కోసం ముందస్తు ప్రిపరేషన్ చాలా అవసరం. రూపం మార్చుకోవడం కోసం అవసరమైన సమయం దర్శకనిర్మాతలు కూడా హీరోలకు ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్లపై అనవసర ఒత్తిడిని పెంచడం కూడా శ్రేయస్కరం కాదని గమనించాలి. ముఖ్యంగా తమ అభిమానులను, ప్రేక్షక దేవుళ్లను అలరించడం కోసం తమకు తాముగానే ఇలా స్టెరాయిడ్లతో రిస్కులో పడటం సరికాదనేది కూడా హీరోలు గుర్తించాలి.






































