స‌ముద్రం మ‌ధ్య‌లో ఒంట‌రి త‌నం కోసం న‌టుడు యాట్!

madhavan on purchasing yacht

 

నటుడు మాధవన్ తన జీవితంలో చేసిన అత్యంత ఖరీదైన కొనుగోలు గురించి  ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన నివాసం తర్వాత తాను కొనుగోలు చేసిన అత్యంత కాస్ట్లీ వస్తువు దుబాయ్‌లో ఉన్న ఒక చిన్న యాట్ (పడవ) అని తెలిపారు. అయితే ఈ లగ్జరీ కొనుగోలు పట్ల తనకు ఎలాంటి మొహమాటం లేదని దీని వెనుక ప్రత్యేకమైన ప్యాషన్ దాగుందన్నారు.

కరోనా లాక్‌డౌన్ కాలంలో  ఖాళీ సమయాన్ని ఆయన ఎంతో సృజనాత్మకంగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో బోటింగ్ ..నావిగేషన్‌పై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు మాధవన్ పేర్కొన్నారు. పదిహేను రోజులు శ్రద్ధగా చదివి, పరీక్షలు రాసి తాను అధికారికంగా కెప్టెన్స్ లైసెన్స్ పొందానని గుర్తు చేసుకున్నారు.

ఆ లైసెన్స్ సాధించిన జోష్‌లోనే  చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి పడవను కొనుగోలు చేసినట్లు తెలిపారు. దుబాయ్‌లోని కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా  చిన్న, హ్యాండిల్ చేయడానికి సులువైన యాట్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇది తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇస్తోందని  పేర్కొన్నారు.

నగరం హడావుడికి దూరంగా సముద్రం మధ్యలో ఒంటరిగా ప్రశాంతంగా గడపడానికి  యాట్ తనకు ఎంతో సహాయ పడుతుందన్నారు. అక్కడ కూర్చుని కొత్త కథలు రాసుకోవడానికి తనకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి  మంచి ప్రదేశంగా మారిందని తెలిపారు. సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఖర్చు చేస్తూ  నచ్చిన కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదని మాధ‌వ‌న్ అభిప్రాయపడ్డారు.

Why madhavan purchased yacht