స్కైలో `కింగ్` ఆడియో రైట్స్
King Audio Rights
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం `కింగ్` విడుదల కాకముందే వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో (మ్యూజిక్) హక్కులు ఏకంగా రూ. 50 కోట్ల రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆడియో డీల్స్‌లో ఇది మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. సచిన్-జిగర్ సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్‌ను దక్కించుకోవడానికి దిగ్గజ మ్యూజిక్ లేబుల్స్ పోటీ పడగా, ఈ స్థాయి భారీ ఆఫర్‌తో డీల్ ఖరారైంది.
భారతీయ సినీ చరిత్రలో రణబీర్ కపూర్ నటించిన `రామాయణ` ఫ్రాంఛైజీ రెండు భాగాలకు కలిపి రూ. 75 కోట్లకు ఆడియో హక్కులు అమ్ముడవగా.. ఆ తర్వాత `ధురంధర్ 2` అత్యంత భారీ ధరను దక్కించుకుంది. ఇప్పుడు వాటి తర్వాతి స్థానంలో షారూఖ్ ఖాన్ `కింగ్` నిలిచింది. అయితే రెండు భాగాలు ఉన్న సినిమాలను పక్కన పెడితే.. ఒకే ఒక్క భాగానికి (సింగిల్ ఫిల్మ్) రూ. 50 కోట్ల మార్కును అందుకోవడం నాన్-థియేట్రికల్ మ్యూజిక్ బిజినెస్‌లో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ భారీ డీల్‌తో `కింగ్` చిత్రం నాన్ థియేట్రికల్ మార్కెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.







































