పారితోషికంతో తోపు హీరోయిన్ ఎవరంటే?
Actress
ఇప్పటివరకు పారితోషికాల విషయాల్లో హీరోల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతుంది. ఆ హీరో ఇంత తీసుకుంటున్నాడు, ఈహీరో రెమ్యునరేషన్ లో తోపు అంటూ నెట్టింట చర్చలు చూస్తుంటాము. కానీ ఇప్పుడు హీరోయిన్స్ నడుమ కూడా పారితోషికం పై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంలో నార్త్ హీరోయిన్స్ ని తలదన్నే వారు లేరు.
అక్కడి టాప్ హీరోయిన్స్ పారితోషికాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారనే చర్చ మొదలైంది. అందులో హాలివుడ్ కి వెళ్లొచ్చినా బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందరికన్నా ఎక్కువగా పారితోషికం అందుకుంటుంది.
ప్రియాంక చోప్రా ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.25 నుంచి రూ.30 కోట్ల పారితోషికం అందుకుంటుంది. ఆతర్వాత స్థానంలో దీపికా పదుకొనె రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు చర్చ చేస్తుందట. ఆతర్వాత స్థానంలో అలియా భట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు హీరోయిన్స్ పారితోషికం విషయంలో టాప్ 3 లో ఉన్నట్లుగా తెలుస్తుంది.







































