రామాయణాన్ని అందుకే చూడాలా?
Reason to watch Ramayana
పురాణాల ఆధారంగా ఎన్నోసార్లు రామాయణ, మహాభారతాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు ఇలా అనేక రూపాల్లో రామాయణ, మహాభారతాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఒకటే కథ, అందులోని పాత్రలు ఒకటే. కానీ అందులో నటులే మారుతున్నారు. బడ్జెట్ లు మారుతున్నాయి.
కథ ఒకటే కానీ వేరు వేరు నటులు కనిపించడం, అందులో కాస్త డ్రామా క్రియేట్ చెయ్యడం, గ్రాఫిక్ వర్క్స్ ని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. తెలుగులోనూ రామాయణం అనేకసార్లు తెరకెక్కింది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం వరకు, నందమూరి బాలకృష్ణ శ్రీరామ రాజ్యం ఇలా రామాయణాన్ని పలువురు తెరకెక్కించారు.
హిందీలోనూ అంతే. అదే రామాయణాన్ని ఆదిపురుష్ గా చిత్రీకరిస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. కారణం గ్రాఫిక్స్ వర్క్స్, పాత్రల తీరుని ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రామాయణాన్ని నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీలు రూ.4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పుడు ఈ రామాయణంలోని నటులు, అందులోని విఎఫెక్స్ కోసమే దానిని చూడాలి. రాముడిగా రణబీర్ కపూర్, సీత గా సాయి పల్లవి, ముఖ్యంగా రావణ్ గా యశ్, సూర్పనఖ గా రకుల్ ప్రీత్ సింగ్ లు, అలాగే సినిమాలోని గ్రాఫిక్స్ కోసమే ఈ రామాయణాన్ని వీక్షించాలనేలా ట్రైలర్ కనిపించింది. మరి ఈ రామాయణాన్ని ఆడియన్స్ ఎంత ప్రేమిస్తారో చూడాలి.








































