`ధురంధర్: ది రివెంజ్` (2026) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని రీతిలో రూ. 3000 కోట్ల వసూళ్లను సాధించిన రణవీర్ సింగ్ - దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసారు. `ధురంధర్ 2` ఏకంగా బాహుబలి 2 గ్లోబల్ రికార్డులనే అధిగమించే స్థాయికి చేరడంతో ఆదిత్య ధర్ మార్కెట్ విలువ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన రణవీర్ సింగ్ ఎనర్జీ .. వెర్సటైలిటీకి సరిపోయేలా ఒక `లార్జర్ దన్ లైఫ్` కథాంశాన్ని సిద్ధం చేస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఈ భారీ విజువల్ డ్రామాను మార్చి 2027 నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం ఆదిత్య ధర్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ , ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రణవీర్ సింగ్ తన సొంత నిర్మాణంలో తెరకెక్కుతున్న జోంబీ థ్రిల్లర్ `ప్రళయ్`ని పూర్తి చేసిన తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టులో చేరనున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో..ఎక్కడా రాజీ పడకుండా అత్యంత గ్రాండ్‌గా నిర్మించబోతున్నారు. యూరి, ధురంధర్ వంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో జోరు మీదున్నాడు ధర్. ఈసారి భారీ వసూళ్ల లక్ష్యంగా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చిలో మరిన్ని వివరలు వెల్లడి కానున్నాయి.




ఒకే రోజు మూడు మహా క్షేత్రాల దర్శనం
Loading..