యానివర్సరీ ట్రిప్ లో నయన్ - విగ్నేష్

Nayanthara on vacation Nayanthara on vacation

 

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన జీవితంలో స్పెషల్ డేస్ కి మాత్రం భర్త విగ్నేష్ శివన్, కొడుకులతో కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే సమ్మర్ ట్రిప్ కి వెళ్లొచ్చిన నయనతార-విగ్నేష్ శివన్ లు ఇప్పుడు మరోసారి.. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్ కు వెళ్లారు.

భర్త-కొడుకులతో కలిసి క్యూట్ గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని నయనతార షేర్ చేసింది. భర్త విగ్నేష్ శివన్ తో రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్ ని ఆమె షేర్ చెయ్యగానే అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు. విగ్నేష్ శివన్ తో, కొడుకులతో కలిసి నయనతార వెనిస్ నగరంలో కనిపించింది.

అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ సరదాగా కనిపించిన నయన్ ను చూసిన వారు ఆమె అందాన్ని, ఆమె ఆనందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. 

Nayanthara on anniversary vacation