పరిటాల రవి హెచ్చరిక.. బాలయ్య సినిమాకు హైలైట్ సీన్
paruchuri Gopala krishna interesting comments on paritala Ravi
సినిమాల్లోని కొన్ని పవర్‌ఫుల్ సన్నివేశాలు..సంభాషణలు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన డైలాగ్‌ల వెనుక నిజ జీవిత అనుభవాలు, సమాజంలోని ప్రముఖ వ్యక్తుల మాటలు దాగి ఉంటాయనేది పచ్చి నిజం. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `సమరసింహారెడ్డి` చిత్రంలోని ఓ కీలక సన్ని వేశానికి- దివంగత రాజకీయ నాయకుడు పరిటాల రవి నిజ జీవితంలో వ్యక్తపరిచిన ముందస్తు జాగ్రత్త .. దార్శనికతకు బలమైన సంబంధం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఓ సందర్భంలో పరిటాల రవితో జరిగిన వ్యక్తిగత సంభాషణను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో ఆయన అన్న మాటలే వెండితెరపై ఒక హైలైట్ సీన్‌గా మారడానికి ఎలా స్ఫూర్తినిచ్చాయో వివరించారు.
రాజకీయాల్లో నిరంతరం ముప్పు పొంచి ఉండే వాతావరణంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో? పరిటాల రవి ప్రవర్తన ద్వారా స్పష్టమవుతుంది. అత్యంత ఆప్తులు అనుకున్న వారి విషయంలో కూడా, శత్రువులు ఒక్కోసారి స్నేహితుల రూపంలో వచ్చి వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి చిన్న విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన నమ్మేవారు.
ప్రాణ రక్షణ కోసం ఒక నాయకుడు పాటించే ముందస్తు వ్యూహం ..అపారమైన లౌక్యం పరుచూరి సోదరులను ఎంతగానో ఆకట్టుకుంది. దాన్నే వారు కమర్షియల్ హంగులతో జోడించి సినిమాలో కథానాయకుడి పాత్రలో గంభీరత్వాన్ని, శత్రువుల ఎత్తుగడలను తిప్పికొట్టే చైతన్యాన్ని ఎలివేట్ చేయడానికి పవర్‌ఫుల్ సీన్‌గా మార్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.







































