శ్రీజ కొణిదెల స్ఫూర్తిదాయక అంతర్గత ప్రయాణం
Sreeja Konidela opens up On she overcome from personal struggles
జీవితంలో ఎదురయ్యే కొన్ని కఠినమైన పరిస్థితులు -బాధాకరమైన క్షణాలు మనిషిని మానసికంగా ఎంతో కుంగదీస్తాయి. ముఖ్యంగా సమాజంలో నిరంతరం నిఘా ఉండే సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వ్యక్తులు, తమ వ్యక్తిగత జీవితంలోని హెచ్చుతగ్గులను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. మెగా డాటర్ శ్రీజ కొణిదెల జీవిత ప్రయాణంలోని క్లిష్టమైన దశలను ..వాటి నుండి తాను నేర్చుకున్న పాఠాలను పంచుకుంటూ గతంలోని మానసిక వేదనను అధిగమించడం గురించి తొలిసారి ఓపెన్ అయ్యారు.
కష్టాలు ఎదురైనప్పుడు వాటి నుండి పారిపోవడం కంటే ఆ గాయాలను అంగీకరించి ముందుకు సాగడమే నిజమైన ఉపశమనానికి తొలి అడుగు అని అభిప్రాయపడ్డారు. సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు మనకు మనమే అసహాయులుగా ఫీల్ అవుతాము. కానీ మన సంతోషానికి .. భవిష్యత్తుకు వేరేవరో బాధ్యులు కారని ఆ నియంత్రణ, ఆ శక్తి మన చేతుల్లోనే ఉందనే సత్యాన్ని తెలుసుకోవడం మన ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేస్తుంది. ఈ తరహా దృక్పథ మార్పు మనల్ని నిందలు వేసే స్థితి నుండి బాధ్యత తీసుకునే మానసిక పరిణతి వైపు నడిపిస్తుందన్నారు
శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారో తెలిసిందే. తొలుత శిరీష్ భరద్వాజతో ప్రేమ వివాహం..కొన్నాళ్లకు ఆ బంధం వీగిపోవడం..అనంతరం భరత్ కన్ను మూయడం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీజకు కళ్యాణ్ దేవ్ తో రెండవ విహహమైంది. ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవని సంగతి తెలిసిందే. ఇలా వ్యక్తిగత జీవితంలో శ్రీజ ఎంతో నలిగిపోయారు అన్నది తెలిసిందే.






































