టాలీవుడ్ వైపు ముంబై గ్లామర్!
Mumbai Glamour Looking Towards Tollywood
ఇండియాలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ భారీ పాన్-ఇండియా కథలు, సాంకేతిక ప్రమాణాలు దేశవ్యాప్తంగా అగ్ర నటీనటులను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక గీతాలు .. అతిథి పాత్రలకే పరిమితమైన బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్‌ను కెరీర్‌కు ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతిలోకసుందరి వారసురాలు జాన్వి కపూర్ `పెద్ది`తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సరసన `దేవర 2` వంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఛాన్సులందుకుంది.
ఇదే బాటలో సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కూడా సినీ అరంగేట్రం కోసమే నేరుగా తెలుగు ఇండస్ట్రీని ఎంచుకుని `శ్రీనివాస మంగాపురం` అనే చిత్రంతో పరిచయమవుతుంది. ఇలా నూతన నటీమణులే కాకుండా బాలీవుడ్‌ను శాసిస్తున్న స్టార్ క్వీన్స్ సైతం టాలీవుడ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కు తోన్నయాక్షన్ ఎంటర్టైనర్ `రాకా`లో దీపికా పదుకునే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం సూపర్ స్టార్ మహేష్ సరసన `వారణాసి`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఉత్తరాది సంచలనం తృప్తి దిమ్రి కూడా `స్పిరిట్` సినిమాతో లాంచ్ అవుతుంది. ఇలా కొత్త భామలంతా వరుసగా టాలీవుడ్ క్యూ కట్టడంతో ఆ చిత్రాలపై క్రేజ్ అంతకంకు రెట్టింపు అవుతుంది. ఆ భామలు నటించే హీరోలు కూడా అంతా పాన్ ఇండియా స్టార్లు కావడంతో? ఆ చిత్రాలపై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.







































