టాక్సిక్ విషయంలో యశ్ ఆలోచనేమిటో?

Yash New Plans For Toxic ReleaseYash New Plans For Toxic Release

 

జూన్ 4 న విడుదల కావాల్సిన పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ చిత్రం వాయిదాపడింది. కానీ కొత్త డేట్ విషయంలో యశ్ ఆలోచన ఎలా ఉందొ ఎవరి ఊహకు అందడమే లేదు. హాలీవుడ్ లో సినిమాని విడుదల చేసేందుకు ఇంకా వర్క్ జరుగుతూ ఉన్న కారణంతో టాక్సిక్ విడుదల వాయిదా వేసినట్టుగా చెప్పినా కొత్త డేట్ ఇవ్వకపోవడంపై అందరిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.

కెజిఎఫ్ సీరీస్ తర్వాత యశ్ ఆచి తూచి పట్టాలెక్కించిన టాక్సిక్ చిత్రాన్ని మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చెయ్యాలని ప్లాన్ చేసినా.. టీజర్ కి డివైడ్ టాక్ రవడంతోనే యశ్ టాక్సిక్ విడుదల విషయంలో వెనక్కి తగ్గారని, కాదు టాక్సిక్ ఓటీటీ డీల్ మరో కారణమనే మాట ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.

టాక్సిక్ ప్రొడక్షన్ సంస్థ కెవిఎన్ వారు ఓటిటి హక్కుల విషయంలో సందిగ్ధంలో ఉన్నారని, వారు చెప్పిన డీల్ లో  కేవలం ముప్పై నుంచి నలభై శాతమే కంపెనీలు ఆఫర్ చేశాయని, దీని వల్లే డీల్స్ ఆగిపోయాయని.. అందుకే టాక్సిక్ విడుదల కు ఆలస్యమనే టాక్ వినిపిస్తుంది.

ఇలా సైలెంట్ గా ఉంటె టాక్సిక్ ని మర్చిపోయే ప్రమాదం ఉంది. కనీసం వార్తల్లో కూడా కనిపించని టాక్సిక్ కి ఎంత త్వరగా రిలీజ్ డేట్ లాక్ చేస్తే అంత బెటర్ అని యశ్ అభిమానుల అభిప్రాయం.
 

Yash New Plans On Toxic