కొరియన్ ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్రల కోసం అనుసరిస్తున్న విపరీతమైన డైట్ పద్ధతులు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయి. కిమ్ జి-వోన్, పార్క్ మిన్-యంగ్ వంటి ప్రముఖ నటీమణులు కేవలం నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత డైట్‌లను అనుసరిస్తూ ఒక్కసారిగా బరువు తగ్గడం చర్చనీయాంశమైంది. పాత్రకు న్యాయం చేయాలనే వారి అంకితభావం మంచిదే అయినా? సరైన పోషకాహారం లేకుండా కేవలం లిక్విడ్స్‌పై ఆధారపడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రకమైన ఎక్స్‌ట్రీమ్ డైట్లు కేవలం నటీమణులకే కాకుండా వారిని ఆదర్శంగా తీసుకునే సాధారణ యువతపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కనిపించే అతి సన్నని రూపాలను చూసి చాలా మంది అమ్మాయిలు ప్రమాదకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొరియన్ ప్రపంచంలో అత్యంత సన్నగా ఉండాలి అనే అప్రకటిత నిబంధన ఈ స్థాయి ఒత్తిడికి కారణమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమతో పోలిస్తే కొరియన్ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్ విషయంలో ఈ ఒత్తిడి మరింత తీవ్రంగా కని పిస్తోంది. టాలీవుడ్ లేదా బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాణాంతకమైన డైట్ పద్ధతులు చాలా అరుదు. నటన కోసం శరీరాన్ని మార్చుకోవడం ఒక కళాత్మక నిబద్ధత అయినప్పటికీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంమైంది. కళ కోసం చేసే త్యాగం ప్రాణాల మీదకు రాకూడదని అభిమానులు, నిపుణులు కోరుకుంటున్నారు. ఆ మధ్య ఓ తెలుగు నిర్మాత కూడా కేవలం నీళ్లతో నే డైట్ చేసారు. ప్రతిగా చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. మనిషి బ్రతకానికి తిండి అవసరం లేదని నీళ్లు ఉంటే చాలని సలహా కూడా ఇచ్చారు.





రామాయణం పారితోషికాలు

Loading..