Advertisementt

టాలీవుడ్ కు బాలీవుడ్ స‌వాల్ త‌ప్ప‌దా

Sun 29th Mar 2026 05:43 PM
bollywood challenges tollywood  టాలీవుడ్ కు బాలీవుడ్ స‌వాల్ త‌ప్ప‌దా
Bollywood Big Challenge For Tollywood టాలీవుడ్ కు బాలీవుడ్ స‌వాల్ త‌ప్ప‌దా
Advertisement
Ads by CJ

 

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో స్వర్ణయుగాన్ని అనుభవిస్తోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. అయితే మారుతున్న కాలం ,పెరుగుతున్న పోటీ దృష్ట్యా కేవలం ఈ నలుగురు దర్శకులు మాత్రమే సరిపోరనే చర్చ  ఇండ స్ట్రీలో మొదలైంది. పాన్-వరల్డ్ స్థాయిలో తెలుగు సినిమా ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే రాజమౌళి లాంటి దార్శనికత ఉన్న మరికొంతమంది సరికొత్త క్రియేటర్లు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన టెక్నీషియన్ల అవసరం ఎంతైనా ఉంది.

 

బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ ఫామ్‌లోకి వస్తూ టాలీవుడ్‌కు సవాల్ విసురుతోంది. ముఖ్యంగా ధురందర్ 2 వంటి భారీ విజయంతో ఆదిత్య ధర్ దంగ‌ల్ రికార్డు 2000 కోట్ల‌ను బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది. అదే రికార్డు గ‌తంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ పేరిటి ఉంది. ప్ర‌స్తుతం నితీష్ తివారీ రామాయ‌ణాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం హిట్ అయితే ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు న‌మోదవుతాయి.

అలా ఆదిత్య‌, నితీస్ లు తమ అద్భుతమైన మేకింగ్ , కంటెంట్‌తో బాలీవుడ్ గ్రాఫ్‌ను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్తున్నారు. ఇలాంటి బలమైన పోటీని ఎదుర్కోవాలంటే? తెలుగు పరిశ్రమ నుండి కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా? టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూ విజువల్ వండర్స్‌ను సృష్టించే పవర్‌ఫుల్ ప్రాజెక్టులు మరిన్ని రావాల్సి ఉంది.

 

గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించాలంటే కేవలం యాక్షన్ మాత్రమే సరిపోదు. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ , బలమైన కథా బలం తోడవ్వాలి. టాలీవుడ్ ఇప్పుడు ఒక పరివర్తన దశలో ఉంది. మన హీరోలకు వేల కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్నప్పటికీ ఆ వసూళ్లను నిలబెట్టుకోవాలంటే దర్శకులు నిరంతరం కొత్తదనంతో రావాలి. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టెక్నాలజీని వాడుకుంటూ, మేకింగ్ స్టాండర్డ్స్‌ను పెంచుకున్నప్పుడే తెలుగు సినిమా ప్రపంచ సినిమా సింహాసనంపై సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలదు.

Bollywood Big Challenge For Tollywood:

Bollywood issues Challenge For Tollywood

Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ