పెద్ది ఫస్ట్ షాట్, పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ చూసాక సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పెద్ది పై కన్నేశారు. పెద్ది గురించి బాలీవుడ్ మీడియా లో వస్తున్న వార్తలు చూసి బాలీవుడ్ వాళ్లు పెద్ది గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ హిందీలో పెద్ది ని జియో స్టూడియోస్ రిలీజ్ చెయ్యబోతుంది అని తెలుస్తుంది.
ధురంధర్ 2 బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న జియో స్టూడియోస్ ఇప్పుడు పెద్ది ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి ఆడియన్స్ కి పెద్ది లోని ఆటలు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. క్రికెట్, కుస్తీ, రామ్ చరణ్ లుక్స్ అన్ని పెద్ది పై నార్త్ లో బాగా క్రేజ్ పెరిగేలా చేసింది.
హీరోయిన్ కూడా బాలీవుడ్ అమ్మాయే. జాన్వీ కపూర్ క్రేజ్ అలాగే రెహమాన్ మ్యూజిక్ అన్ని హిందీ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చ గా కనెక్ట్ అవడం ఖాయం. అందుకే పెద్ది విషయంలో బాలీవుడ్ వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో పెద్ది కి నార్త్ లో మంచి కలెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సునామీనే.




ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
Loading..