తెలుగు రాష్ట్రాల వెలుగు కిరణం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి అడ్డంకులన్నీ తొలగాయి.
తను ఏదైనా అనుకున్న, లేదంటే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఎక్కడికైనా వెళ్లి, దానిని సాధించేవరకు నిద్రపోని గుణం ఏపీ విద్యా, ఐటి శాఖామంత్రి నారా లోకేష్ ది. అంతేకాదు మాటిస్తే అది నెరవేర్చేవరకు కష్టపడే యువ నాయకుడు నారా లోకేష్.
గతంలో లక్షలాది ప్రజల ఆశాజ్యోతి ఆర్డీటీని రక్షించుకుంటాం.. అని మాట ఇచ్చిన మంత్రి నారా లోకేష్.. అసలు సాధ్యం కాదు అనుకున్న పనిని తనదైన శైలి మంత్రాంగంతో కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీ అడ్డంకులు తొలగించి దానిని సుసాధ్యం చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ కేంద్రం గతంలో ఉత్తర్వులిచ్చింది. దానితో ఆర్డీటీకి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.
ఆ సమయంలోనే ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్ ఆ సమస్యను నారా లోకేష్ దృష్టికితీసుకొచ్చారు. అప్పుడే తానున్నానని అన్ని చక్కబెడతాను అని మాటిచ్చిన నారా లోకేష్ కేంద్ర పెద్దలతో మాట్లాడారు. లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం ఆర్డీటీ. ఈ ట్రస్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ట్రస్టు సేవలు నిరంతరం కొనసాగించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తాం అని ఫెర్రర్‌కు, ప్రజలకు మాటిచ్చిన లోకేష్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు. సున్నితమైన సమస్యను సమయస్ఫూర్తిగా పరిష్కరించారు. ఆర్డీటీకి విదేశాల నుంచి నిధుల రాకకు మార్గం సుగమం చేశారు. దీనిపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబబు నివాసానికి విచ్చేసి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆర్డీటీ ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞతలు కాదు, ఆర్డీటీ తరఫున లక్షలాది ప్రజలు మంచిపని చేసిన మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులు అని చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. నిస్వార్థంగా దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి, శిక్షణ ద్వారా ఆర్డీటీ అందిస్తున్న సేవలు ముందు తాను చేసిన పని చాలా చిన్నదని అన్నారు.





డబ్బింగ్ సినిమాపై ఎందుకింత ప్రేమ 

Loading..