Advertisementt

జాన్వీపై క‌ర‌ణ్ జోహార్ అస‌హ‌నం

Sun 22nd Mar 2026 03:20 PM
karan johar  జాన్వీపై క‌ర‌ణ్ జోహార్ అస‌హ‌నం
Karan Johar expressed frustration overJanhvi జాన్వీపై క‌ర‌ణ్ జోహార్ అస‌హ‌నం
Advertisement
Ads by CJ

త‌న ట్యాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ నుంచి వెళ్లిపోయిన జాన్వీక‌పూర్, ఇత‌ర న‌టీన‌టుల‌ విష‌యంలో క‌ర‌ణ్ జోహార్ అస‌హ‌నంతో ఉన్నారా? అంటే అవున‌నే తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి..  ఇది కృత‌జ్ఞ‌త లేని వృత్తి అని క‌ర‌ణ్‌ ఆవేద‌న చెందారు..`` ఇది విష‌వ‌ల‌యం.. ఒత్తిడి కార‌ణంగా ఒక‌చోటి నుంచి మ‌రో చోటికి తార‌లు మారుతుంటా``ర‌ని అన్నారు. జాన్వీ ఇటీవ‌ల కంపెనీ మారిన విష‌యాన్ని క‌ర‌ణ్ గుర్తు చేసుకున్నారు.

 

అయితే ఒక‌సారి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన తార‌లు తిరిగి మ‌ళ్లీ కంపెనీలోకి వ‌చ్చిన సంద‌ర్భాలున్నాని అన్నారు. పాసింగ్ క్లౌడ్స్ లా స్టూడెంట్స్ వ‌చ్చి వెళుతుంటార‌ని అన్నారు. నేటిత‌రానికి తీవ్ర‌మైన ఒత్తిడి ఉంది. ఇంత‌కుముందు రోజుల్లో ఇలా ఉండేది కాద‌ని కూడా క‌ర‌ణ్ విశ్లేషించారు.

 

జాన్వీ క‌పూర్ త‌న కంపెనీని వ‌దిలేసాక‌.. క‌ర‌ణ్ బాధప‌డ్డ‌ట్టే క‌నిపిస్తోంది. నేటిత‌రం మ‌న‌స్త‌త్వం గురించి విశ్లేషించారు. వేగంగా పెద్ద స్టార్లు అయిపోవాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ర‌ణ్ వీర్, ప‌రిణీతి, జాన్వీ వంటి తార‌లు కంపెనీలు మారుతున్నార‌ని గుర్తు చేసారు.. సామాజిక మాధ్య‌మాలు.. సాంకేతిక‌త కార‌ణంగా న‌టీన‌టులు చంచ‌లంగా ఉన్నార‌ని అన్నారు. ఒక నిర్మాతగా తన ప్రాధాన్యత ఎప్పుడూ తన సొంత ఏజెన్సీ నటులకే ఉంటుందని స్పష్టం చేశారు. సినిమా రంగంలో ఎవ‌రికీ లాయ‌ల్టీ అనేది ఉండ‌ద‌ని కూడా వాపోయారు.

Karan Johar expressed frustration overJanhvi:

Karan Johar Dissatisfied With Janhvi Kapoor

Tags:   KARAN JOHAR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ