Advertisementt

కొరియాలో కన‌క‌రాజు హంగామా

Sun 15th Mar 2026 02:57 PM
korean kanakaraju  కొరియాలో కన‌క‌రాజు హంగామా
Kanakaraju Hungama In Korea కొరియాలో కన‌క‌రాజు హంగామా
Advertisement
Ads by CJ

 

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ జానర్లను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న    చిత్రం `కొరియన్ కనకరాజు`. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న  చిత్రం షూటింగ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం దక్షిణ కొరియాకు పయనమైంది. అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు.

 

దక్షిణ కొరియాలోని అందమైన లొకేషన్లలో వారం రోజుల పాటు  చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో వరుణ్ తేజ్‌తో పాటు హీరోయిన్ రితికా నాయక్, కమెడియన్ సత్యపై కీలకమైన సీన్స్ , పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఇండియాలో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న  సినిమా,  కొరియా షెడ్యూల్‌తో టోటల్ టాకీ పార్ట్‌ను ముగించుకోనుంది.

 

యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇండియా - కొరియా నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. వరుణ్ పుట్టిన రోజున విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే.

 

కొరియా షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. ఆ వెంటనే ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Kanakaraju Hungama In Korea:

Korean Kanakaraju Lands In Korea

Tags:   KOREAN KANAKARAJU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ