Advertisementt

నిర్మాత అర్జున రాజు ఇకలేరు

Fri 13th Mar 2026 07:17 PM
arjuna raju  నిర్మాత అర్జున రాజు ఇకలేరు
Producer Arjuna Raju నిర్మాత అర్జున రాజు ఇకలేరు
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత ఎమ్ .అర్జునరాజు ఈరోజు హైదరాబాద్ లో మరణించారు . 

ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు వున్నారు. 

అర్జునరాజు గారు తన మిత్రుడు శివరారాజుతో కలసి 1979లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్ .టి .రామారావు, శ్రీదేవి జంటగా వేటగాడు అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా అనూహ్యమైన విజయమా సాధించింది.

ఆ తరువాత 1981లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే కొండవీటి సింహం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో ఎన్ .టి.రామారావు, శ్రీదేవి కలసి నటించారు. ఇది కూడా ఘన విజయం సాధించింది. 

చిరంజీవితో జేబుదొంగ, శ్రీకాంత్ తో మా నాన్నకు పెళ్లి, ఎస్ .వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో జాబిలీ, నాగార్జునతో బావ నచ్చాడు, జగపతి బాబు తో జగపతి, అల్లరి నరేష్ తో మా అల్లుడు వెరీ గుడ్ చిత్రాలను నిర్మించారు. 

హిందీలో ధర్మేంద్రతో జానీ దోస్తు, జితేంద్రతో ఫర్జ్ ఔర్ కానున్ చిత్రాలను రూపొందించారు .

తెలుగు సినిమా రంగంలో మంతెన అర్జునరాజు చాలా స్టయిలిష్ ప్రొడ్యూసర్. మహానటుడు ఎన్ .టి .రామారావు, నటి శ్రీదేవికి అత్యంత ఇష్టమైన నిర్మాత. శ్రీదేవి హిందీ రంగంలోకి వెళ్లిన తరువాత ఆమె కాల్ షీట్స్ కావాలంటే అర్జునరాజు గారిని సంప్రదించేవారు.

సినిమా అంటే ఆయనకు అమితమైన ఇష్టం. సినిమా నిర్మాణంలో రాజీపడటం ఆయనకు తెలియదు.

రామోజీ ఫిలిం సిటీ లో నిర్మించిన మొదటి సినిమా ఇవివి దర్శకత్వంలో వచ్చిన మానాన్నకు పెళ్లి కావడం విశేషం .

అర్జునరాజు గత కొంతకాలంగా అస్వస్తులుగా వున్నారు. శుక్రవారం రోజు ఆయన ఇహలోక యాత్ర ముగించారు.

Producer Arjuna Raju:

Producer Arjuna Raju

Tags:   ARJUNA RAJU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ