Advertisementt

యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి

Fri 13th Mar 2026 12:09 PM
bullet reddy movie  యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి
Bullet Reddy Movie is proceeding with its regular shooting యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి
Advertisement
Ads by CJ

ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బుల్లెట్ రెడ్డి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై ఆది దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్ర విశేషాలను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత హీరో ఆది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ ఖయ్యూం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత హీరో ఆది మాట్లాడుతూ - యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ చిత్రంలో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు. ఆయనకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల విలువైన నిధి దక్కించుకునేందుకు కొందరు దురాశ పరులు ఎలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నాకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం ఉండటం ఈ సినిమాలో నటించేందుకు కలిసొచ్చింది. ఖయ్యూం మాస్టర్ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఆదిలాబాద్ అడవుల్లో పాట చిత్రీకరణ జరిపాం. అలాగే నిజామాబాద్ లో ఫైట్ సీక్వెన్స్ లు రూపొందించాం. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఏప్రిల్ 5వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత గోవాలో జరిపే షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్ మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్ లో చేస్తాం. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న మా మూవీని రిలీజ్ చేస్తాం. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అమలాపురం అంబేద్కర్ జిల్లా.. ఈ మూడు జిల్లాల్లో ఒక పది థియేటర్స్ లో కాంపాక్ట్ గా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అన్నారు.

ఫైట్ మాస్టర్ ఖయ్యూం మాట్లాడుతూ - నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ను. ఆది ఉండేది మా పొరుగు ఊరులోనే. ఆది నాకు శిష్యుడు. అయితే ఈ సినిమా కోసం అతను పడే కష్టం చూసి అతనికి అభిమానిని అయ్యాను. ఈ మూవీలో ఆది ఎంత కష్టపడ్డాడో తెరపై చూస్తారు. మంచి ఫైట్స్, ఎంటర్ టైన్ మెంట్, ఆకట్టుకునే పాటలతో బుల్లెట్ రెడ్డి సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.

Bullet Reddy Movie is proceeding with its regular shooting:

Bullet Reddy Movie is proceeding with its regular shooting at a rapid pace

Tags:   BULLET REDDY MOVIE
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ