Advertisementt

మ‌హేష్‌-బ‌న్నీలలో ఎవ‌రు ముందు

Thu 05th Mar 2026 12:47 PM
allu arjun  మ‌హేష్‌-బ‌న్నీలలో ఎవ‌రు ముందు
Who will come first Allu Arjun Or Mahesh మ‌హేష్‌-బ‌న్నీలలో ఎవ‌రు ముందు
Advertisement
Ads by CJ

 

 

మ‌హేష్ -బ‌న్నీల‌లో పాన్ ఇండియాలో ముందు వ‌రుస‌లో ఉంది ఎవ‌రు? అంటే నో డౌట్ అంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెబుతారు. `పుష్ప` ప్రాంచైజీతో ఆ ఘ‌నత‌ను బ‌న్నీ సాధించాడు. `వార‌ణాసి`తో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా ఆ జాబితాలో చేరుతాడు. మ‌రి మ‌హేష్ -బ‌న్నీల‌లో పాన్ వ‌ర‌ల్డ్ లో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేది ఎవ‌రు? అంటే ఇంకా చెప్ప‌లేని ప‌రిస్థితులే ఉన్నాయి.

 

ఇప్ప‌టికే `వార‌ణాసి` రిలీజ్ క‌న్ప‌మ్ అయింది. 2027 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దాదాపు 120 దేశాల్లో పాన్ వ‌ర‌ల్డ్ లోనే రిలీజ్ అవుతుంది. మ‌రి అన్ని దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా? ఒక్కోసారి ఒక్కో దేశంలో రిలీజ్ చేస్తున్నారా? అన్న‌ది తేలాలి. అలాగే బ‌న్నీ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రాన్ని గ్లోబ‌ల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 

అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో `వార‌ణాసి` కంటే ముందుగా రిలీజ్ ఉంటుందా?  `వార‌ణాసి` రిలీజ్ త‌ర్వాత ఉంటుందా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. కానీ ఓ విష‌యంలో బ‌న్నీ సేవియ‌ర్ గా  మ‌హేష్ క‌నిపిస్తున్నాడు. రెండు పాన్ వ‌ర‌ల్డ్ రిలీజ్ లు కాబ‌ట్టి మ‌హేష్ ముందుగా వ‌స్తే గ‌నుక అత‌డి సినిమా రిజ‌ల్ట్ ఏ దేశంలో తేడా కొట్టినా బ‌న్నీ అలెర్ట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంటుంది. త‌ప్పిదాల‌ను స‌రిదిద్దుకుని మ‌న కంటెంట్ అక్క‌డ వ‌ర్కౌట్ అవుతుందా?  లేదా? అన్న ఓ అంచ‌నాకి రావొచ్చు.

Who will come first Allu Arjun Or Mahesh:

Allu Arjun Or Mahesh who will come first 

Tags:   ALLU ARJUN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ